BANGARUTALLI
FAQs
1.What is the eligibility criteria to avail Bangaru Talli scheme?
A.The Girl child born within “two live births norm” born on or after 1st May 2013
B. Having White ration card like WAP/RAP/TAP/YAP/AAP
C. Institutional delivery in Public or Private hospital (home deliveries are considered in ITDA areas in, only registration is permitted in other areas and the first milestone incentive will not be paid)
D. Mandatory documents (xerox copies) to produce for upload are

a. A copy of the ration card,
b. A copy of date of birth certificate of the girl child/ren,
c. A copy of bank A/c pass book of the mother/father/guardian (in the same order if the prior not having the latter),
d. A copy of Aadhar card (of the one who produced bank A/c),
e. A copy of mother or guardian undertaking
f. Bangaru Talli data input sheet signed by the ANM & Medical Officer
g. Photo of the mother & child together
2. What is meant by “Girl child within two live births norm” ?
A. It means that the girl children are ineligible if the mother has two living children before May 1st 2013 in spite of any gender.
B.It means that if the twins are born in the first delivery and are living, no more children born in successive deliveries are eligible.
C.It means that if one child born is either boy or girl and living from previous deliveries and any number of girl children born in the next one delivery are eligible
3. What is the order of submission of white ration card?
a. Mother name in any white ration card like in her mother’s or in-law’s card.
b.If mother has no ration card the ration card of the father is also considered.
4.Is the girl child born in Other State hospitals from bordered districts of AP eligible ?
a. The delivery or birth certificates issued in other state languages or state hospitals can be translated signed and uploaded.
5.If the mother changes her name or her surname changes after marriage and different names exist in different copies of mandatory documents to upload is she eligible ?
a. If the copies are certified for name change they are eligible.
6. Is there any time limit for registration under Bangaru Talli?
a. Yes. The time limit for registration is 21 days after the baby is born.
7. Whom to contact for date of birth certificate of the Girl Child?
a. The certificate issued by the medical officer is accepted.
b. If the baby is born in her grand mother’s village or in towns or cities or in other than resident village, the birth certificate can be availed from the local births and deaths registration authority, the Panchayat Secretary in rural areas and Municipal Commissioner in urban areas.
8. Whom to contact for registration?
a. The Village Organisations at the village or Mandal Samakhya at the mandal level in rural areas.
b. The Slum Level Federation or Town Level Federation in Urban areas.
9. If the mother marries to a man who is already married or to a widower having two or more children already is her girl child within two live births norm eligible.
a. Yes. Registration permitted under “two living children norm”.
10. If mother is not alive does the girl child eligible ?
a. Yes. Either father or guardian can register. The guardian can be anybody including trusts or State home.
11.If the ineligible is found to be paid, how to remit ?
A. To the following A/c by Challan
Name of the Account : CEO, SERP - Bangaru Talli
A/c No : 62300166260
IFSC : SBHY0020916
Bank : SBH, Treasury Branch, Gunfoundry, Hyd
 
 
Download

బంగారు తల్లి

తరచుగా అడిగే ప్రశ్నలు

 

         1.       బంగారుతల్లి పధకంలో నమోదుకు కావల్సిన అర్హతలు ఏమిటి ?

 

A.      “ఇద్దరు జీవించియున్న పిల్లలు” నిభందన లోబడి మే 1, 2013 నాడు లేదా తర్వాత ఆర్ధికంగా వెనకబడిన లేదా తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబంలో జన్మించిన ఆడ పిల్ల/లు

B.      ఏదేని తెల్ల రేషన్ కార్డు, అనగా WAP/RAP/TAP/YAP/AAP కార్డులు

C.      ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రిలో కాన్పు. (సమీకృత గిరిజనాభివృద్ది ఏజెన్సీలో ఇంటిలో జరిగే కాన్పులలో జన్మించిన ఆడ శిశువులు కూడ అర్హులు)

D.      తప్పని సరిగా బంగారుతల్లి వెబ్సైటు లో అప్లోడ్ చేయవలసిన కాపీలు  (Xerox కాపీలు మాత్రమే)

a.       తెల్ల రేషన్ కార్డు ప్రతి

b.       బంగారు తల్లి జనన ధ్రువ పత్రం ప్రతి  

c.        తల్లి/తండ్రి/సంరక్షకుని బ్యాంకు ఎకౌంటు నెంబర్ ఉన్న పాస్ బుక్ పేజి ప్రతి (ఇదే వరసలో ముందు వారికి లేనపుడే తర్వాత వారిది ఇవ్వాలి)

d.       తల్లి/తండ్రి/సంరక్షకుని (బ్యాంకు ఎకౌంటు  నెంబర్ ఎవరిది ఇస్తే వారి) ఆధార్ కార్డు ప్రతి

e.        తల్లి/తండ్రి/సంరక్షకుని సంతంకంతో ఇచ్చిన “అండర్ టేకింగ్” ప్రతి

f.        వైధ్యాదికారి, ఏ.యెన్.ఏం సంతకంతో ఉన్న “బంగారు తల్లి డేటా ఇన్పుట్ షీట్” ప్రతి

g.        తల్లి బిడ్డ తో దిగిన ఫోటో

 

         2.       “ఇద్దరు జీవించియున్న పిల్లలు” నిభందన అనగా ఏమిటి ?

A.      కాన్పు సంఖ్యతో సంబంధం లేకుండా మే 1, 2013 తేదికి ముందు జన్మించి మరియు జీవించి ఉన్న ఆడ లేదా మగ శిశువుల సంఖ్య రెండు లేదా ఎక్కువ ఉన్న ఈ పధకానికి అర్హత లేదు.

B.      అనగా మొదటి కాన్పులోనే ఇద్దరు కవలలు జన్మించి జీవించి ఉన్న అర్హత లేదు

C.      అనగా ఎన్ని కాన్పుల సంఖ్యతో సంబంధం లేకండా జీవించి ఉన్న ఆడ లేదా మగ శిశువు ఒక్కరే ఉన్న, తదుపరి ఒకే కాన్పులో ఒక్కరు లేదా కవలలు లేదా అంతకన్నాఎక్కువ ఆడ బిడ్డలు జన్మించిన ఈ పధకానికి అర్హులు.

         3.       తెల్ల రేషన్ కార్డు ప్రతిని ఏ ప్రాధాన్యత క్రమంలో సమర్పించాలి ?

a.       తల్లి పేరున ఉన్న ఏదైనా రేషన్ కార్డు. తన కుటుంబ తెల్ల రేషన్ కార్డు లేదా తన తల్లి గారి రేషన్ కార్డు లేదా ఉమ్మడిగా ఉన్న అత్తగారి కుటుంబ రేషన్ కార్డు.

b.       తల్లి కి రేషన్ కార్డు లేనపుడు తండ్రి పేరున్న రేషన్ కార్డు

         4.       రాష్ట్ర సరిహద్దుల అవతల ఉన్న ఆసుపత్రులలో తీసుకున్న జనన లేదా జన్మ దృవీకరణ  పత్రాలకు చెల్లుబాటు ఉందా?

a.       ఉంది. వీటిని సంబందిత లేదా నివాస పరిధి మండలంలో తెలుగులోకి తర్జుమా చేసి, వివరాలు సరైనవిగా దృవీకరిస్తూ సంతకం చేసి అప్లోడ్ చేయాలి.  

 

         5.       పెళ్లి తర్వాత వివిధ కారణాలతో తల్లి పేరు మార్చుకున్న లేదా వివిధ తప్పనిసరిగా జత పరచవలసిన డాకుమెంట్స్ నందు పేరు లేదా ఇంటి పేరు లేదా మొత్తం పేరు మారిన లేదా తప్పుగా నమోదు అయినా అర్హత ఉంటుందా ?

a.       ఉంటుంది. అయితే సంబందిత ప్రతులపై ఆయా కారణాలను నమోదు చేస్తూ, వివరాలు సరైనవే అని ద్రువికరిస్తూ సంతంకం చేసి అప్లోడ్ చేయాలి.

 

         6.       బంగారుతల్లి పధకంలో నమోదుకు ఏమైనా టైం లిమిట్ ఉందా ?

a.       ఉంది. బిడ్డ జన్మించిన తర్వాత 21 రోజులలోగా నమోదు చేసుకోవాలి.

         7.       బంగారుతల్లి పధక నమోదుకు జన్మ దృవీకరణ పత్రాన్ని ఎలా పొందాలి?

a.       వైద్యాధికారి ఆసుపత్రిలో ఇచ్చిన పత్రం

b.       బిడ్డ జననం నివాస ప్రాంత పరిధి దాటి, అమ్మ గారి ఊరిలో ప్రసవించిన లేదా ఏదైనా పట్టణ లేదా నగర ఆసుపత్రిలో ప్రసవించిన, నివాస ప్రాంతంలో ఉన్న పంచాయతి సెక్రటరీ లేదా మునిసిపల్ కమీషనర్ ఇచ్చిన జన్మ దృవీకరణ పత్రం

         8.       బంగారు తల్లి పధకంలో నమోదు కొరకు ఎవరిని సంప్రదించాలి?

a.       గ్రామంలోని గ్రామ సమాఖ్య లేదా మండలం లోని మండల సమాఖ్య.

b.       పట్టణ ప్రాంతాలలో వాడ సమాఖ్య లేదా పట్టణ సమాఖ్య

 

         9.       తల్లి రెండవ పెళ్లి చేసుకున్న, భర్తకు ఇదివరకే పిల్లలున్న ఆమెకు జన్మించిన బిడ్డలు అర్హులేనా?

a.       ఆమెకు “ఇద్దరు జీవించియున్న పిల్లలు” నిభందన లోబడి అర్హులే.

 

         10.    తల్లి మరణించిన ఆమె బిడ్డలకు అర్హత ఉంటుందా?

a.       ఉంటుంది. తండ్రి లేదా సంరక్షకులు నమోదు చేయవచ్చును. ఏదైనా ట్రస్టులు లేదా స్టేట్ హోం లు సంరక్షకులుగా కూడ వ్యవహరించ వచ్చును.

 

         11.      అనర్హులకు వెళ్ళిన ప్రోత్సాహకాన్ని ఎలా తిరిగి చెల్లించాలి?

a.       చలాన ద్వారా దిగువ ఎకౌంటుకు జమ చేయాలి

ఎకౌంటు పేరు : సి.ఈ.వో. సెర్ప్-బంగారు తల్లి

ఎకౌంటు నెంబర్: 62300166260

IFSC కోడు: SBHY0020916

బ్యాంకు : ఎస్.బి.హెచ్., ట్రెజరి బ్రాంచ్, గన్ఫౌండ్రీ , హైదరాబాద్  

    DESIGNED & MAINTAINED BY BLUEFROG MOBILE TECHNOLOGIES PVT. LTD.